Nov 05,2022 15:57

ప్రజాశక్తి -పోలవరం(ఏలూరు) : పోలవరం నియోజకవర్గ స్థాయి పోటీలకు శనివారం ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలు బుట్టాయిగూడెంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో కుక్కునూరు, వేలేరుపాడు, టి.నర్సాపురం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం ,పోలవరం, మండలాల నుండి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాదేవి, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి డి.రాజేంద్రప్రసాద్‌, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఏ.సాయి శ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్చార్జ్‌ కే.నాగేశ్వరావు, మండలాల ఇంచార్జెస్‌ పాల్గొన్నారు.