Dec 02,2022 13:35

పెదబయలు (అల్లూరి) : రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థినిలను పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం అభినందించారు. విశాఖపట్నం లేమార్తి అగ్రహారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గత నెల 30 న నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడలలో ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి క్రీడలలో డి.అఖిల్‌, జి.లాలిప్రియ, జె.నాగవైతన్య త్రో బాల్‌ తి అస్విత ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ సారా తెలిపారు. చదువుతోపాటు విద్యార్థినిలు క్రీడలలో ప్రతిభ కనబరచి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.రాజు, రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయిన విద్యార్థినిలను అభినందించారు.