Oct 03,2023 16:30

ప్రజాశక్తి-వీరబల్లి (అన్నమయ్యజిల్లా): రాయచోటిలో ఇటీవల జరిగిన అండర్‌ 14, 17 ఏళ్ల విభాగం స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ క్రీడా పోటీల్లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వీరబల్లి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయికి 9 మంది ఎంపికైనట్లు ఫిజికల్‌ డైరెక్టర్‌ వేణుమాధవ్‌ రాజు తెలిపారు. ఎంపికైన వారిలో సాఫ్ట్‌ బాల్‌ 17 ఏళ్ల విభాగంలో వెంకట శివ కుమార్‌, సాహుల్‌, కీర్తి ప్రియ, కావ్య, బేస్‌ బాల్‌ 17 ఏళ్ల విభాగంలో ప్రేమాంజనేయ, సాఫ్ట్‌ బాల్‌ 14 ఏళ్ల విభాగంలో రామ్‌ చరణ్‌, నాగేశ్వర, బేస్‌ బాల్‌ 14 ఏళ్ల విభాగంలో వినరు కుమార్‌, రెడ్డిసంజన ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులందరూ రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడానికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయురాలు గంగాదేవి సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఎంపికైన విద్యార్థులను, పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ను పాఠశాల సిబ్బంది అభినందించారు.