వాషింగ్టన్: వచ్చే ఏడాది (2024) హెచ్1బీ వీసాలకు త్వరలోనే రెండో రౌండ్ లాటరీ సెలెక్షన్ నిర్వహిస్తామని అమెరికా ఫెడరల్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తెలిపింది. అప్లికేంట్లు గతంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లలో అదనంగా వచ్చిన రిజిస్ట్రేషన్లను ర్యాండమ్ సెలెక్షన్ పద్ధతిలో సెలెక్ట్ చేస్తామని వెల్లడించింది. హెచ్-1బీ వీసాల తొలి లాటరీ రౌండ్ మార్చిలో జరిగింది. అమెరికా ఏటా 65 వేల వీసాలను జారీ చేస్తుంటుంది. అమెరికా యూనివర్సిటీల్లో స్టెమ్ కోర్సులు చేసిన విదేశీయుల కోసం మరో 20 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటాయి.










