బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్
కోపెన్‌హాగెన్(డెన్మార్క్): బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి 2వ సీడ్ చిరాగ్‌శెట్టిాసాత్విక్ సాయిరాజ్ జోడీ ప్రవేశించింది. గురువారం జరిగిన మూడుసెట్ల హోరాహోరీ పోరులో చిరాగ్-సాత్విక్ జంట 21-15, 19-21, 21-9తో 5వ సీడ్ మలేషియాకు చెందిన మార్టిన్‌ాకర్నాండోలను ఓడించారు. ఈ మ్యాచ్ సుమారు గంటా ఒక నిమిషాలసేపు సాగింది. ఇక మహిళల డబుల్స్ త్రీసా జోలీాగాయత్రి గోపీచంద్ జంట పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో త్రీసాాగాయత్రి జంట 14-21, 9-21తో టాప్‌సీడ్, చైనాకు చెందిన ఛెన్-జియా, ఫెన్ చేతిలో వరుససెట్లలో ఓడారు.










