
నంబర్ ర్యాంక్‌తో కొత్త చరిత్ర
బిడబ్ల్యుఎఫ్ ర్యాంకింగ్స్ విడుదల
లాసన్నె: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి సత్తా చాటారు. ఆసియా క్రీడల్లో పసిడి పతకం కైవసం చేసుకున్న ఈ జంట.. తాజాగా బిడబ్ల్యుఎఫ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకారు. దీంతో పురుషుల డబుల్స్‌లో నంబర్ ర్యాంక్ దక్కించుకున్న తొలి భారత ద్వయంగా రికార్డుల్లోకెక్కారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత జంట బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం పతకం సాధించారు. ఈ క్రమంలోనే ఇటీల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ తరఫున డబుల్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి జోడీగా చరిత్రకెక్కారు. ఈ ఏడాది స్విస్ ఓపెన్ నెగ్గిన ఈ జోడీ.. జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ నెగ్గడం ద్వారా భారత్ నుంచి బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ సూపర్-1000 సిరీస్ నెగ్గిన తొలి జంటగానూ రికార్డు నెలకొల్పారు. ఓవరాల్‌గా భారత్ నుంచి గతంలో ప్రకాశ్ పదుకోన్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నారు. మంగళవారం ప్రకటించిన బిడబ్ల్యుఎఫ్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 15వ ర్యాంక్ దక్కించుకోగా.. శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో సింధు.. 13వ స్థానంలో నిలువగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్-త్రిసా జాలీ జంట 16వ ర్యాంక్‌కు చేరారు.