Mar 24,2023 21:08

ముంబయి : సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కొత్తగా గెలాక్సీ ఎఫ్‌14 5జిని ఆవిష్కరించింది. శుక్రవారం దీన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 5ఎన్‌ఎం ప్రాసెసర్‌, ఎక్సీనోస్‌ 1330 చిప్‌సెట్‌తో వస్తోందని పేర్కొంది. దీని బ్యాటరీ 2 రోజుల వరకు పని చేస్తుందని తెలిపింది. 50 ఎంపి ప్రధాన కెమెరా, 13 ఎంపి సెల్పీ కెమెరాతో దీన్ని ఆవిష్కరించింది. 4జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌ ధరను రూ.12,990గా, 6జి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌ ధరను రూ.14,490గా నిర్ణయించింది. మార్చి 30 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నట్లు పేర్కొంది.