May 23,2023 20:56

న్యూఢిల్లీ : సామ్‌సంగ్‌ ఇండియా టెక్‌ ఆవిష్కరణల కోసం సాల్వ్‌ ఫర్‌ టుమారో పోటీని ప్రకటించినట్లు తెలిపింది. ఇప్పటికే దీనికి 50వేల పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని పేర్కొంది. తమ ఆలోచనలను కార్య రూపంలో ఉంచడానికి పోటీలో నిలిచే ప్రముఖ మూడు బృందాలకు రూ.1.5 కోట్లు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. మే 31 వరకు దరఖాసులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది.