ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : జిల్లాలోని మండపేట మండలంలోని ఇప్పనపాడు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రోడ్డు పాడైపోవడంతో ఆ వీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు ఎట్టకేలకు రోడ్డు పనులు ప్రారంభించారు. మండల పరిషత్, పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షల రూపాయలతో అంబేద్కర్ నగర్, రజకపేటలలో రోడ్డు, డ్రైన్లను అభివద్ధి చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శి వి.సుబ్బారావు తెలిపారు. రోడ్డు పనులు పనులు ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని వారు కోరుతున్నారు.










