May 01,2023 08:29

భూగర్భంలో పొంచి ఉన్న ప్రమాదపు
అంచున మసిబారిన ముఖంతో
సేవలందించెను
సింగరేణి బొగ్గు కార్మికుడు
మురికి కాలువల్లో మలినాన్ని తీసి ,
చీపురు చేత బట్టి చెత్త చెదారాన్ని చేతులతో
ఎత్తి స్వచ్ఛతను ఇచ్చెను
సపాయి కార్మికుడు

మేఘాల్ని తాకే మేడలు కట్టి
విలాసవంతమైన నివాసమును
ఏర్పాటు చేసే భవన నిర్మాణ
శిల్పి సుతారి కార్మికుడు
ఆకాశమంత ఎత్తులో నురగలు కక్కే
వెన్నెలలా కైపెక్కే తాటి కల్లులొట్టితో
దాహం తీర్చెను గీతా కార్మికుడు
కండల కష్టాన్ని నమ్ముకొని
మాసిన బట్టలతో మూటలు
మోసెను హమాలి కార్మికుడు
శరీరానికి సౌందర్యాన్ని ఇస్తూ
మగ్గాలు మృదంగాలై
మధుర స్వరాల్ని ధ్వనింపజేస్తూ
వస్త్రాలను ప్రసాదించెను
చేనేత కార్మికుడు

చెరువులను సంరక్షించేందుకు
నడుం బిగించిన గంగపుత్రులై
సమస్త మానవాళికి చేపల్ని
పౌష్టికాహారంగా ఇచ్చెను
మత్స్య కార్మికుడు

అన్ని రంగాల్లో అంతర్భాగంగా
సేవలందించేందుకు సర్వం సిద్ధంగా
ఉండే సర్వంతర్యామి కార్మికుడు

- ముక్కపల్లి సాగర్‌
98662 09436