Aug 25,2022 16:06

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2022లో భారత బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌ ఓటిమితో టోర్ని నుంచి నిష్క్రమించింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో థారులాండ్‌కు చెందిన షట్లర్‌ బుసానన్‌ ఒంగ్బామ్రంగ్‌ఫాన్‌ చేతిలో సైనా ఓటమిపాలైంది. మొదటి గేమ్‌ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న సైనా 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్‌ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్‌లో అన్‌సీడెడ్‌ భారత ప్లేయర్లు ధ్రువ్‌ కపిల- ఎం.ఆర్‌ అర్జున్‌ తొలిసారిగా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అదే విధంగా చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు.