
ఎన్‌టిఆర్, కొరటాల కాంబోలో వస్తోన్న ఎన్‌టిఆర్-30 చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. సినిమాలోని కీలక ఫైట్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చిత్రీకరణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కీలక పోరాట సన్నివేశాల చిత్రీకరణ సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరుల నేపథ్యంలో ఈ కీలక ఫైట్‌ను రూపొందిస్తున్నారు. ఎన్‌టిఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.