May 20,2023 12:44

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ-మూసాపేట ప్రాంతాల మధ్య ఉన్న కైత్లాపూర్‌ మైదానంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు జరగనున్న విషయం తెలిసింది. ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు జూ.ఎన్టీఆర్‌ హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆహ్వానం ఇచ్చేటప్పుడే సావనీర్‌ కమిటీకి చెప్పినట్లు ఎన్టీఆర్‌ స్పష్టం చేశారు. కాగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా టిడిపి అధినేత చంద్రబాబు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సినీనటులు మురళీమోహన్‌, వెంకటేశ్‌, ప్రభాస్‌, కల్యాణ్‌ రామ్‌, అల్లు అర్జున్‌, రానా, సుమన్‌, జయప్రద, కె. రాఘవేంద్రరావు తదితరులు పాల్గొనన్నున్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై ముద్రించిన ప్రత్యేక సంచిక, వెబ్‌సైట్‌లను ఆవిష్కరించనున్నారు.