
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. 'సీతారామం' బ్యూటీ మృణాల్‌తో 'దేవర' కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ మూవీటీమ్ అఫీషియల్ ఓ సముద్రపు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని బట్టి భారీ తుఫాను, సముద్రపు అలల మధ్యలో హై ఓల్జేట్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఒక స్పెషల్ సెట్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఓ హాలీవుడ్ టీమ్ ఆధ్వర్యంలో రూపొందించే ఈ సీక్వెన్స్ లోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తెలుసుకుని మరి తారక్ చేస్తున్నారట.