Oct 19,2023 14:24

జూనియర్‌ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఆస్కార్‌ వేదికపై సందడి చేసిన తారక్‌... ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, అభిమానులు జూనియర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో మన టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు కే హురు క్వాన్‌, మార్షా స్టెఫానీ బ్లేక్‌, కెర్రీ కాండన్‌, రోసా సలాజర్‌ కూడా ఉన్నారు.