న్యూఢిల్లీ : పంటల రక్షణ, మార్కెటింగ్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ తాజాగా కోహినూర్ సీడ్స్‌కు చెందిన సదానంద్ కాటన్ సీడ్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీంతో తమ పత్తి విత్తనాల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకున్నట్లయ్యిందని పేర్కొంది. పత్తి విత్తనాల వ్యాపారంలో వాటాదారులకు సమగ్రమైన, వినూత్న, ప్రగతిశీల పరిష్కారాలను అందించాలనే తమ లక్ష్యానికి ఈ విలీనం మరింత దోహదం చేయనుందని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ సీడ్స్ సిఇఒ సత్యేందర్ సింగ్ పేర్కొన్నారు.