వేసవిలో చెమటలు బాగా పట్టి నీరసం వస్తుంది. త్వరగా అలిసిపోతాం. దానికి కారణం శరీరం డీ హైడ్రేషన్ గురికావడమే. ఈ సమస్యలకు సబ్జా గింజలు చక్కని పరిష్కారం చూపుతాయి. వీటిలో చాలా రకాల ప్రోటీన్స్ ఉన్నాయి.
- సబ్జా గింజలకు నీరు తగలగానే 10 రెట్లు లావుగా తయారయ్యి జెల్‌లా తయారవుతాయి. వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
- సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. బరువూ తగ్గుతారు.
- సబ్జా గింజలను నిమ్మకాయి నీరు, షర్బత్, మిల్క్‌షేక్‌ల వంటి రిఫ్రెష్ డ్రింక్స్‌లలో వేసుకుని రోజుకు మూడు, నాలుగు గ్లాసులు తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
- సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
- సబ్జా గింజలను నూరి కొబ్బరి నూనెలో చేసి, ప్రభావిత ప్రాంతాలపై రాయడం వల్ల తామర, సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.
- సబ్జా గింజలను నానబెట్టకుండా, నూరి ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి, కొన్ని నిమిషాలు పాటు వేడి చేసి అప్లై చేయండి. చర్మం దెబ్బతిన్నప్పుడు కొత్త చర్మ కణాలను ఏర్పరుస్తుంది.










