హైదరాబాద్:గాంధీభవన్ వద్ద ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వందలాదిగా అభ్యర్థులు తరలివచ్చారు. ఈ తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. 1600/ 800 మీటర్లు క్వాలిఫై ఐనా అభ్యర్థులను మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారని, పాత పద్ధతిలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు పెట్టాలన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేశారు.