ముంబయి : రాజస్థాన్‌లోని జైపుర్ నుండి ముంబయికి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. రైలు మహరాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళుతున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్‌కుమార్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.