ప్రజాశక్తి -అనంతపురం : పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని మోకాళ్ళపైన నిల్చొని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల బస్సు పాసులు ఐదు కిలోమీటర్ల వంద రూపాయలు గతంలో ఉండేది ఇప్పుడు 140 రూపాయలు అంటే అదనంగా 40 రూపాయలు పెంచడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు చదువును దూరం చేయడం కోసమే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు పెంచారని మండిపడ్డారు. ఇప్పటికైనా పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జై చంద్ర, చంద్రశేఖర్, జస్వంత్, హర్ష కుమార్, భగత్ మహేష్, శ్రీరామ్, నవీన్, అభి, వినోద్ పాల్గొన్నారు










