ఏలూరు : నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ... ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ను సోమవారం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ప్లకార్డులను పట్టుకొని ధర్నా చేపట్టారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను వెంటనే అందించాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని, ఇతర విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










