Nov 08,2023 11:54

విస్సన్నపేట (ఎన్‌టిఆర్‌) : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు విస్సన్నపేట మండలంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అన్ని విద్యాసంస్థలు బంద్‌ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది. ఈ బంద్‌ సందర్భంగా విస్సన్నపేట విద్యార్థులను ఉద్దేశించి మాజీ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు నాగరాజు మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుందని అన్నారు. విభజన హామీలు ఇవ్వకుండా అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరించాలని చూస్తుందని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని చెప్పిన హామీలు అమలు కావడంలేదన్నారు. విద్యార్థుల భవితను తాకట్టు పెట్టే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు సునీల్‌, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు మేకల జ్ఞాన రత్నం, కిషోర్‌, గద్దల రామకఅష్ణ, ప్రొద్దుటూరు బాలు, పుట్రెల అనిల్‌, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.