హైదరాబాద్: గ్రూపు-2 పరీక్ష వాయిదా పడిందని మనస్థాపానికి గురై హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రయివేటు హస్టల్లో ఆత్మహత్య చేసుకోని చనిపోయిన నిరుద్యోగ విద్యార్థీనీ ప్రవళ్లిక ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ అభిప్రాయ పడుతుంది. రాష్ట్రంలో గత సంవత్సరం కాలంలో ఇది 8వ నిరుద్యోగుల ఆత్మహత్య సరైన ప్రణాళిక లేకుండా రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వ్యవరిస్తుంది. పరీక్ష నిర్వహణలో లోపభూయిష్టంగా ఉంది, దానికి తోడు పారదర్శకంగా నిర్వహించకపోవడం లాంటివి జరిగుతుంటే మళ్ళీ సమయాన్ని పోడిగించడం అంటే ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు చెల్లించి, హస్టల్స్ లో వేలాది రుపాయాలు ఖర్చు చేస్తూ నిరుద్యోగులు చదువుకుంటున్నారు,వారీ ఇబ్బందులు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అధికారం కోసం ఇస్తున్న ప్రాధాన్యత కనీసం విద్యార్ధి, నిరుద్యోగులకు భరోసా కల్పించడం లేదు, పోన్నాల ఇంటికెళ్లిన కెటిఆర్ ,విద్యార్ధి మరణిస్తే కనీసం వారి కుటుంబానికి భరోసా ఇచ్చే సమయం లేదా అని ఎస్‌ఎఫ్‌ఐ ప్రశ్నిస్తుంది. మఅతురాలి కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగులకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ నిలుస్తుందని ,రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది.