Feb 04,2023 21:26

హైదరాబాద్‌ : ప్రయివేటు బీమా కంపెనీ ఎస్‌బిఐ లైఫ్‌ 'కలలు కంటే నిజం చేసుకోండి' పేరుతో కొత్త ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ ఒక్కరూ తమ కలలను నెరవేర్చుకునే ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుందని ఆ సంస్థ పేర్కొంది. ''ఎస్‌బిఐ లైఫ్‌ ఎల్లప్పుడూ వినియోగదారుల మారుతున్న అవసరాలను అర్థం చేసుకోవడానికి చాలా ఆసక్తితో ఉంటుంది. కొత్త క్యాంపెఇయన్‌ వినియోగదారులకు ప్రేరణను ఇస్తోంది.'' అని ఎస్‌బిఐ లైఫ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, సిఎస్‌ఆర్‌ బ్రాండ్‌ చీఫ్‌ రవీంద్ర శర్మ పేర్కొన్నారు.