న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డుల జారీ సంస్థ ఎస్‌బిఐ కార్డ్ ప్రస్తుత పండుగ సీజన్‌లో ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఫెస్టివ్ సీజన్ -2023లో భాగంగా దేశంలోని 2700 నగరాల్లో దాదాపు 2200 ఆఫర్లను కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఆఫ్‌లైన్‌లోనూ 27.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందవచ్చని పేర్కొంది. కన్య్సూమర్ డ్యూరెబుల్స్, మొబైల్స్, ల్యాప్‌ట్యాప్స్, ఫ్యాషన్, ఫర్నీచర్, అభరణాలు తదితర కొనుగోళ్లపై ఆఫర్లను అందిపుచ్చుకోవచ్చని ఎస్‌బిఐ కార్డ్ సిఇఒ, ఎండి అబ్జిత్ చక్రవర్తి పేర్కొన్నారు.