ఆసియా క్రీడల క్రికెట్‌లో పాల్గనే భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే జట్టుకు కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. రుతురాజ్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం సాయంత్రం హాంగ్జౌకు బయలుదేరి వెళ్లింది. టీమిండియా మహిళా జట్టు స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఐసిసి ర్యాంక్ ఆధారంగా భారతజట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్ స్టేజ్‌నుంచి ఆడనుంది. గ్రూప్ దశలో అత్యధిక రన్‌రేట్ కలిసి నాలుగు జట్లు నాకౌట్‌కు చేరనున్నాయి. ఇక భారత్ పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్స్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అక్టోబర్ 3నుంచి క్వార్టర్స్, 6న సెమీస్, 7న ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, ప్రభు సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్లు), వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, శివం మావి, రవి బిష్ణోరు, అవేశ్ ఖాన్, అర్షదీప్‌సింగ్.
స్టాండ్ బై: యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
గ్రూప్-ఎ : నేపాల్, మాల్దీవులు, మంగోలియా
గ్రూప్-బి : జపాన్, హాంకాంగ్, కొలంబియా
గ్రూప్-సి : మలేషియా, సింగపూర్, థాయ్ లాండ్










