న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు కోల్పోయి 82.05కు పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లు బలహీనంగా ట్రేడింగ్ కావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా డాలర్‌తో పోల్చితే రెండున్నర వారాల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడేలో 81.83-82.15 మధ్య కదలాడింది. సోమవారం సెషన్‌లో 81.78 వద్ద ముగిసింది.










