ప్రజాశక్తి-పాడేరు టౌన్ (అల్లూరి సీతారామరాజు) : నేటి సమాజంలో శాంతిని, క్రైస్తవుల ఐక్యతను నెలకొల్పడమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆరాధన టీవీ ఛానల్ పిలుపుతో ప్రతి ఏటా ఈస్టర్ ఆదివారం ముందు రోజున శనివారం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతోందని తెలిపారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ... అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీని స్థానిక ఎస్ ఐ రంజిత్ ప్రారంభించారు. ఆర్ టిసి కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన రన్ ఫర్ జీసస్ ర్యాలీ సినిమా హాల్ సెంటర్, పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్, మెయిన్ బజార్ మీదుగా కోర్టు దగ్గరలోని అగాపే చర్చి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బిషప్ డా.దైవకఅప చిక్కాల, అల్లూరి జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ ఫౌండర్ లక్మన్ రావు, అధ్యక్షులు పాస్టర్ ఫ్రెడ్రిక్, ప్రధాన కార్యదర్శి డేవిడ్, పోస్టర్స్ తిమోతి, వైవై రత్నం, లూకా, బుచ్చయ్య, సుధాకర్, పాల్ రాజ్, జాషువా, సాల్మన్, ఇశ్రాయేలు, పాల్ డేవిడ్, డేనియల్, రక్షణరాజు, యుసివైఎ సభ్యులు స్టీవెన్ శ్రీనివాస్, రవికుమార్, సత్యరావు, ఆయా చర్చిల క్రైస్తవులు, తదితరులు పాల్గొన్నారు.










