న్యూఢిల్లీ : ఎంజి మోటార్ ఇండియా పండగ సీజన్‌లో తన జడ్‌ఎస్ విద్యుత్ కార్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌యువి జడ్‌ఎస్ ఇవిపై తగ్గింపుతో కొత్త ధరలను నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందులోని ఎక్సైట్ వేరియంట్ ధరను రూ.22.89 లక్షలు, ఎక్స్‌ప్లోజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ధరలను వరుసగా రూ.24.99 లక్షలు, రూ.25.89 లక్షలుగా పేర్కొంది. ఇంతక్రితం ధరలతో పోల్చితే దాదాపు రూ.2.30 లక్షల మేర ఆదా చేసుకోవడానికి వీలుందని అంచనా. జడ్‌ఎస్ ఇవిలో ఇటీవల ఎడిఎఎస్ లెవల్‌ను పరిచయం చేసినట్లు పేర్కొంది. ఈ మోడల్‌పై రూ.50వేల వరకు ఎక్సేంజ్ బోనస్ ప్రారంభమవుతుందని పేర్కొంది.