చెన్నై: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సన్యాసి తనపై చేసిన బెదిరింపులను తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తిప్పికొట్టారు. 'నా తల కోసం రూ. 10 కోట్లు అవసరం లేదు. నా తల దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుంది. నాకోసం అంత మొత్తం వెచ్చించాల్సిన అవసరం లేదు. అయినా ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేమి కాదు. ఎవరి బెదిరింపులకు భయపడను. తమిళనాడు ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి (కరుణానిధి) మనవడిని నేను 'అంటూ స్వామీజీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి తలపై రూ.10 కోట్ల రివార్డును ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సన్యాసి ప్రకటించి, ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే తానే చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.










