Oct 16,2023 10:26

చెన్నై : 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తెలిపారు. చెన్నైలోని నందనం వైఎంసిఎ మైదానంలో డిఎంకె ఆధ్వర్యాన నిర్వహించిన మహిళా హక్కుల సదస్సులో స్టాలిన్‌ ప్రసంగించారు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉండదని అన్నారు. ఇండియా ఫోరం కేవలం ఎన్నికల కూటమి కాదని, విధానపరమైన కూటమి అని తెలిపారు. వెనకబడిన తరగతుల మహిళలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని స్టాలిన్‌ విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును 'ఒక రహస్య ఉద్దేశంతో' మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆరోపించారు. అన్ని మతాలు సమాన హక్కులు పొందాలని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ సదస్సులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు.