వాషింగ్టన్ : నగదు చెల్లింపుల యాప్ గూగుల్ పేలో స్క్రాచ్ చేసిన కొందరికి రూ.80,000 (దాదాపు వెయ్యి డాలర్లు) వరకు ఖాతాల్లో జమ అయ్యాయి. గూగుల్ పేలో చిన్నపాటి టెక్నికల్ సమస్య వల్ల అమెరికాలోని పలువురు ఖాతాదారులు ఈ బంఫర్ ఆఫర్‌ను కొట్టేశారు. కొద్దిమంది పిక్సల్ ఫోన్ యూజర్లు స్క్రాచ్ కార్డులతో రూ.800 నుంచి రూ.80వేల వరకు తమ ఖాతాల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయం దహనంలా వ్యాపించింది. సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని.. క్యాష్ బ్యాక్ అందుకున్న ఖాతాదారుల నుంచి రికవరీ చేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.










