Nov 06,2023 11:35

విజయవాడ : విజయవాడ బస్టాండ్‌ ప్రమాదంలో మృతుల తరపు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని విజయవాడ ఆర్‌టిసి ఎండి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సోమవారం ఉదయం విజయవాడ బస్టాండులో బస్సు బ్రేకులు ఫెయిలయ్యి ప్లాట్‌ ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దీనిపై మీడియాతో ఆర్‌టిసి ఎండి మాట్లాడుతూ ... బస్సు ప్రమాదం దురదృష్టకరం అని అన్నారు. ప్రమాదానికి రెండు వాదనలు వినిపిస్తున్నాయని, 24 గంటల్లో విచారణ పూర్తి చేసి కారణం తెలుసుకుంటామని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడినవారికి ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని చెప్పారు.