ప్రజాశక్తి - గూడూరు (తిరుపతి) : గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం పేషంట్ల సౌకర్యార్థం రోటరీ క్లబ్ గూడూర్ వెస్ట్ ఆధ్వర్యంలో మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరిండెండెంట్ ఎస్ కే షారీనా మాట్లాడుతూ ... పేషంట్ల సౌకర్యార్థం మంచినీటి వసతిని కల్పించిన రోటరీ క్లబ్ గూడూర్ వెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఆర్వో ప్లాంట్ దాత శ్రీకంటి రామ్మోహన్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ గూడూర్ వెస్ట్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి నేతఅత్వంలో అనేక ఉపయోగకర పనులు చేపట్టారని, వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా పేషంట్ల కోసం నేడు ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు. ఆర్వో ప్లాంట్ దాత శ్రీకంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ గూడూర్ వెస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగా పేషంట్ల కోసం మంచినీటి సౌకర్యం కల్పించడానికి ముందుకు వచ్చామని ఆసుపత్రికి సంబంధించి ఏ అవసరం వచ్చిన దాతలు ద్వారా మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆ అవసరాలను తీర్చడానికి ఎప్పుడు ముందుంటామని ఈ ఆర్వో ప్లాంట్ ఏర్పడటానికి ముందుండిన ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డికి ఏజీ మయూరి శ్యామ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ మంచినీటి వసతి కల్పించిన దాత శ్రీ కంటి రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఆసుపత్రికి సంబంధించి పేషంట్ల సౌకర్యార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి రోటరీ క్లబ్ ముందుంటుందని అన్నారు. రోటరీ క్లబ్ గూడూర్ వెస్ట్ ప్రెసిడెంట్ బండి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన పేషెంట్లకు మంచినీటి సౌకర్యం ఇబ్బందిని గుర్తించి నిరుపయోగంగా ఉన్న ఆర్వో ప్లాంట్ ను తిరిగి శ్రీకంటి రామ్మోహన్ రావు దాతఅత్వంతో నేడు ఆర్వో ప్లాంట్ ను తిరిగి పున్ణ ప్రారంభించామని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఆర్వో ప్లాంట్ మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంకు ఉద్యోగి భాస్కర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మరిన్ని వస్తువులను రోటరీ క్లబ్ గూడూర్ వెస్ట్ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్స్ వాసు గౌడ్ ,బమ్మిడి శ్రీనివాసులు,విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










