Jul 10,2023 10:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రోటరీ క్లబ్‌ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా డా.కృష్ణ శాంతి, నీతా విజ్వాని లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం రోటరీ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ .... రోటరీ సేవలు మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ పెంచే విధంగా, వృద్ధులకు అధోవడం, హెల్త్‌ అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, గుడ్డ సంచులు పంపిణీ చేయడం, మహిళలకు ఆర్దికంగా ఉపాధి కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్‌ తిరుమల ప్రసాద్‌, ఆర్‌ కే జైన్‌, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.