
ప్రజాశక్తి-విజయనగరం: లక్కవరపు కోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉదయం టీ కాచుకునే సమయంలో ఘటన జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.