పశు యాజమాన్యంతోనే ఆర్థిక భరోసా : రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రో అధ్యక్షురాలు సునీత లావణ్య
ప్రజాశక్తి-హుకుంపేట (విజయనగరం) : పశు యాజమాన్యంతోనే ఆర్థిక భరోసా అని రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రో అధ్యక్షురాలు సునీత లావణ్య అన్నారు. మంగళవారం ఉదయం విలేకరుల సమావేశంలో సునీత లావణ్య మాట్లాడుతూ ... పశు యాజమాన్యంతోనే గిరిజనులకు స్థిరమైన ఆదాయం సమకూరుతుందని రైతులకు సూచించారు. ఇందుకుగాను గిరిజనులు పాడి గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం వాణిజ్యపరంగా అభివృద్ది చేసి ఆదాయం వనరులకు పెంచుకోవాలని సూచించారు. మండలంలోని గన్నేరు పుట్టు పంచాయతీ గన్నేరు పుట్టు, డోంకినవలస గ్రామంలో కోళ్లు పెంపకం ద్వారా వచ్చే నాటు కోడి గుడ్లును రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రోవారు స్వయంగా బారు బ్యాక్ పద్ధతిలో రైతులకు ఆదాయం సమకూర్చే విధంగా చేస్తున్నామన్నారు. ఇందుకు ఇద్దరు మహిళ రైతులకు నాటు కోళ్లు పెంపకానికి అవసరమైన పనిముట్లు కోడిపిల్లలతో సహా ఆరు నెలలకు సరిపడే ఆహారం కూడా ఉచితంగా ఇస్తున్నామన్నారు. దీంతో రైతులకు చక్కగా నాటు కోడి పిల్లలను పెంచిన తర్వాత స్వయంగా రైతులే కోడి గుడ్లను రూ.15 చొప్పున అమ్ముకుని సంవత్సరానికి 1 లక్ష రూపాయల ఆదాయం సంపాదించుకోవచ్చునని తెలిపారు. కోడి గుడ్లును రోటరీ క్లోబ్ వైజాగ్ మెట్రోవారే రూ.15లకు రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాట్లను బాకూరు పశు వైద్యాధికారి కె.వి వరప్రసాద్ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు తెలిపారు.










