May 01,2023 14:31

ముంబై : రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 212 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (124) శతకం బాదాడు. టార్గెట్‌ ఛేజింగ్‌లో ముంబై బ్యాట్స్‌మన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై 19.3 ఓవర్లలోనే 213 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ యశస్వీ జైస్వాల్‌ అద్భుతంగా ఆడాడని రోహిత్‌ శర్మ కొనియాడాడు. జైస్వాల్‌ ఆటతీరును గతేడాదే చూశానని..ఈ ఏడాది అతను మరింత మెరుగయ్యాడని కొనియాడాడు. అలాగే టీమ్‌ డేవిడ్‌కు పొలార్డ్‌ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందన్నాడు.