Oct 18,2023 16:08

ప్రపంచ కప్‌లో భారీ స్కోర్లతో అదరగొడుతున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటాడు. వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ విరాట్‌ కోహ్లీని తొలిసారి అధిగమించాడు. ఈ జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో ఉన్నాడు. తొలి స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌ మన్‌ గిల్‌ ఉన్నాడు.