Sep 12,2023 21:28

భారతజట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయికి చేరాడు. ఆసియా కప్‌లో శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో రోహిత్‌ ఈ ఫీట్‌ను అందకున్నాడు. కసున్‌ రజిత ఓవర్లో లాంగ్‌ ఆఫ్‌లో భారీ సిక్స్‌ బాది 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ క్లబ్‌లో చేరిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. రోహిత్‌ 241ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు. కోహ్లీ మాత్రం 205ఇన్నింగ్స్‌ల్లోనే 10వేల పరుగుల మైలురాయికి చేరాడు. ఇక భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌(18,426), విరాట్‌ కోహ్లీ(13,024) సౌరభ్‌ గంగూలీ(11,363), రాహుల్‌ ద్రవిడ్‌(10,889), ఎంఎస్‌ ధోనీ(10,773)లు ఈ ఫీట్‌ సాధించారు. వన్డేల్లో రోహిత్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 264 పరుగులు.