ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అనకాపల్లి రూరల్ సిఐ రవికుమార్ అన్నారు. మండలంలోని తాళ్ళపాలెం జంక్షన్‌లో రోడ్డు భద్రత వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి, అదనపు ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఆటో యూనియన్ వాహనదారులు పాల్గొన్నారు.










