Jan 21,2023 13:24

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని నందిగామ శాసన సభ్యులు మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. నందిగామ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ నందిగామ గాంధీ సెంటర్‌ నుండి రధం బజారు వరకు వాకర్స్‌ ప్రదర్శన నిర్వహించారు. నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ... రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. ప్రమాదం జరిగితే ఎంతో నష్టం జరుగుతుందని, దీని వల్ల కుటుంబ సభ్యులు సైతం ఇబ్బందులు పడతారని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ సిగల్స్‌ పాటించాలని కోరారు. నందిగామ మోటార్‌ వెహికల్‌ ఇన్సెపెక్టరు ఎంవిఎన్‌ రాజు మాట్లాడుతూ ... 2019 మోటారు వాహన చట్టం అనేక సవరణలు చేసిందని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ జయరామ్‌, నందిగామ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చిరుమామిళ్ళ చైతన్య కుమార్‌, అధ్యక్షులు మన్నెం శ్రీరాం మూర్తి, సిపిఎం నాయకులు చనుమోలు సైదులు,కటారపు గోపాల్‌, చెరుకుమల్లి పిచ్చయ్య,వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకులు యార్లగడ్డ నాని, పెసరమల్లి శేఖర్‌ బాబు, పిల్లి జయరాజు, ఎంవై దాసు, కట్టప్ప, తదితరులు పాల్గొన్నారు.