వరల్డ్‌కప్ 2023 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వాన్‌సెంచరీతో కదంతొక్కాడు. జ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్‌లతో పాటు చివర్లో సౌద్ షకీల్ 55 బంతుల్లో 75 పరుగులు 5 ఫోర్లు, 4 సిక్స్‌లు మెరుపు ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ 346 పరగులు చేసింది. పాక్ బ్యాటర్లలో అఘా సల్మాన్ 23 బంతుల్లో 33, అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1), షాదాబ్ ఖాన్ 16, ఇఫ్తికర్ అహ్మద్ 7 పరగులు చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, నీషమ్ తలో వికెట్ తీసుకున్నారు.










