పిన్న వయస్సులో
దేశభక్తి కల్గివుండటం
దేశ పరిస్థితులను
అధ్యయనం చేయటం
అన్ని ప్రదేశాల్లో తిరగటం
పరిస్థితులను
అర్ధం చేసుకోవటం
గిరిజనుల కష్టాలను చూసి
చలించిపోవటం
స్వాతంత్య్ర పోరాటానికి
మార్గదర్శి కావటం
విల్లు బాణాలు
చేపట్టేలా చూడటం
గెరిల్లా విద్య నేర్పటం
బ్రిటిష్ దౌర్జన్యాలను
అరికట్టడం
పోలీస్ స్టేషన్లను
ఒకేసారి ముట్టడించడం
మిరపకాయ టపా
పంపించడం
ఒకే రోజు ఒకే సమయంలో
పోలీసు స్టేషన్లపై
మెరుపు దాడి చేయటం
అన్నింట్లో ఒకే ఒక్కడు
అతడే విప్లవ వీరుడు
అల్లూరి సీతారామరాజు
జోహార్ అల్లూరి జోహార్.
- గాదిరాజు రంగరాజు
సెల్ : 8790122275










