జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గద్వాల నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదన్న అసంతఅప్తితో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కఅష్ణమోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గద్వాల కాంగ్రెస్ టికెట్‌ను రేవంత్ కొత్తగా వలస వచ్చిన జడ్పీ చైర్ పర్సన్ సరితకు అమ్ముకున్నారని విమర్శించారు. గద్వాలలో రేవంత్ రెడ్డి బ్యానర్‌ను ప్రభాకర్ రెడ్డి అనుచరులు దగ్ధం చేశారు. ఇప్పటికే సరిత అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్ అసమ్మతి నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.