ఏలూరు : ఏలూరు కాలువ వెంబడి ఇరుపక్కల ఉన్న ఆక్రమణలు ఈనెల 29వ తేదీన తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉంగుటూరు మండలం బాదంపూడి, వెళ్ళమిల్లి, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కైకరం లో 437 ఆక్రమణలు ఉన్నాయి. దీనిపై లోకాయుక్తలో కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలో జూలై 29 నుండీ ఆగస్ట్ 5వ తేదీ లోగా ఆక్రమణలు తొలగించేందుకు తీసుకోవలసిన చర్యలపై ఆర్డీవో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖలు పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతి, విద్యుత్ తదితర మండల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా ఆక్రమణల తొలగింపుతో చిరు వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.










