ముంబయి : నిధుల దారి మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ మాజీ సిఇఒ పునీత్ గోయెంకాకు సెక్యూరిటీ అప్పిల్లేట్ ట్రిబ్యునల్ (ఎస్‌ఎటి)లో ఉపశమనం లభించింది. నిధులను దుర్వినియోగంపై పునీత్ గోయెంకాపై ప్రస్తుతం సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎలాంటి కీలక పదవులు చేపట్టద్దంటూ నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన ఎస్‌ఎటిని ఆశ్రయించగా.. తాజాగా అక్కడ ఆయనకు ఊరట లభించింది. దీంతో గోయెంకా మళ్లీ జీ గ్రూప్‌లో మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కనుంది.