
- ట్రయల్స్ లేకుండానే నేరుగా ఆసియా క్రీడలకు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్‌కు ఊరట లభించింది. ట్రయల్స్ లేకుండానే నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ''అవును.. ఈ ఇద్దరికీ ట్రయల్స్ నుంచి మిన హాయింపు ఇస్తూ భారత ఒలింపిక్ సమాఖ్య అడ్ హక్ కమిటీ నిర్ణయం తీసుకుంది'' అని ఓ అధికారి మంగళవారం తెలిపారు. ఇంతకుముందు ఇదే కమిటీ బజరంగ్, వినేశ్ ఒక్క బౌట్‌లో పోటీ పడితే చాలు అని చెప్పిన విషయం తెలిసిందే. జూలై 22, 23వ తేదీల్లో ఆసియా క్రీడల ట్రయల్స్ నిర్వహించనుండగా.. చైనాలోని గ్వాంఝూ వేదికగా సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి.