Apr 27,2023 21:29

బెంగళూరు: రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కొత్తగా బి2బి వేదిక ఉడాన్‌తో జట్టు కట్టడం ద్వారా తన పానీయాల బ్రాండ్‌ 'క్యాంపా' శ్రేణీని రిటైలర్లు, చిన్న కిరాణ స్టోర్లకు మరింత అందుబాటులోకి తెచ్చింది. ఉడాన్‌తో భాగస్వామ్యం వల్ల క్యాంపా ఉత్పత్తులు 50,000 కంటే ఎక్కువ రిటైలర్లు, కిరాణ స్టోర్‌లకు అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈ పంపిణీ కవరేజ్‌ వచ్చే రెండు నెలల్లో లక్షకు పైగా స్టోర్‌లకు క్రమంగా విస్తరించనుదని ఆశాభావం వ్యక్తం చేసింది.