హైదరాబాద్ : టాలీ సొల్యూషన్స్ కొత్తగా టాలీ ఫ్రైమ్ 3.0ను విడుదల చేసింది. దీని ధరను జిఎస్‌టి మినహా రూ.18,000గా నిర్ణయించింది. ఈ కొత్త వర్షన్ బహుళ జిఎస్‌టిఐఎన్ నిర్వహణను అత్యంత సులభతరం చేస్తుందని టాలీ సొల్యూషన్స్ సౌత్ జోన్ జనరల్ మేనేజర్ భువన్ రంజన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికీ 5 లక్షల ఎంఎస్‌ఎంఇలు మాన్యువల్ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 1.6 క్షల జిఎస్‌టిఎన్ ఎన్‌టిటిలు రిజిస్టర్ అయి ఉన్నాయన్నారు. దీంతో ఇక్కడ విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. తమ వినియోగదారుల కోసం సులభ ఎకౌంటింగ్ విధానాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు అనుకూల పరిష్కారాలను తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామన్నారు.










